Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 7:51 pm Posted by : ramakrishna

పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి

  • ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ రాహుల్ రెడ్డి

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : వచ్చే వినాయక  నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ నబి పండుగలను హిందూ,ముస్లింలు శాంతి యుతంగా మత సామరస్యాన్ని కాపాడేలా జరుపుకోవాలని ఎల్లారెడ్డిపేట సిఐ బి.శ్రీనివాస్ గౌడ్,ఎస్ఐ కే.రాహుల్ రెడ్డి లు తెలిపారు.బుధవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సి ఐ ,ఎస్ ఐ లు మాట్లాడారు.రాబోవు వినాయక నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండగల సందర్భంగా అందరూ కలిసి మెలిసి శాంతి యుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని మతాలకు చెందిన వారు సహనం పాటించాలని పలు సూచనలు చేశారు.