Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 9:13 pm Posted by : ramakrishna

ఆచార ప్రాముఖ్యత తెలపడానికే పండుగలు

 

. . . సర్పంచ్ సమిత్రా శ్రీనివాస్

 

పిట్లం, బతుకమ్మ :

 

ఆచారాల ప్రాముఖ్యతను తెలపడానికి గ్రామాలలో ఊరు పండగలు నిర్వహిస్తారని గ్రామ సర్పంచ్ సమిత్రా శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ బోనాలను నిర్వహించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామంలో గల ప్రతి ఇంటి నుంచి బోనాలను తీసుకువచ్చి ఎల్లమ్మకు, గ్రామ దేవతలకు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారని అలా చేయడం వల్ల గ్రామంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారన్నారు. గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే పండుగ ఘనంగా కన్నుల పండుగగా నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు, యువకులు పాల్గొని పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు.