పెద్దగుట్ట భూములకు ఎసరు
20 ఎకరాల భూముల ఆక్రమణ పోచారం అనుచరులపై కలెక్టరేట్ లో ఫిర్యాదు నిజామాబాద్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ శివారులోని పెద్దగుట్ట భూములపై ఆక్రమార్కుల కన్నుపడింది. అక్కడ అటవి భూమిని ఆనుకుని ఉన్న దర్గా భూములపై కొందరి కన్నుపడడంతో రాత్రికి రాత్రే ఆక్రమణలు షురూ అయ్యాయి. దానితో సంబంధిత భూమిని రక్షించాలని కోరుతూ బైరాపూర్ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అటవి అధికారులు సంబంధిత భూమి తమ పరిధిలోది కాదని, రెవెన్యూ అధికారులు మాత్రం...