Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 6:38 pm Posted by : ramakrishna

విద్యార్థినిలు అన్ని రంగాల్లో ముందుండాలి

. . . తె.యు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

నేటి సమాజంలో విద్యార్థినిలు అన్ని రంగాల్లో ముందుండాలని, వాటికి తగినటువంటి సామర్థ్యాలను పెంపోందించుకోవాలని తెలంగాణ యునివర్సిటీ రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ ఎం.యాదగిరి అన్నారు. కాకతీయ ఇంజనీరింగ్ మహిళ కళాశాలలో 2022-2026 సంవత్సరాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థినిలకు శ్రీరామ గార్డెన్స్ లో గురువారం పట్ట భద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Female students should be at the forefront in all fields.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థినిలకు ఇంజనీరింగ్ పట్టాలను అందించారు.

Female students should be at the forefront in all fields.

అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు ఎల్లపుడు ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలని, పట్టాలు అందుకున్న విద్యార్థినిలు భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని అన్నారు.

Female students should be at the forefront in all fields.

అనంతరం కళాశాల డైరక్టర్ చెరుకూరి రజనీకాంత్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో మా కళాశాల నుండి 232 మంది విద్యార్థినిలు ఇంజనీరింగ్ పట్టాలు పొందడం, చాలా మంది విద్యార్థినిలు సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించడం కాకతీయ విద్యాసంస్థలకు ఎంతో గర్వ కారణమని తెలిపారు.

Female students should be at the forefront in all fields.

కళాశాల ప్రిన్సిపాల్ డా. సెల్వ కుమార్ రాజా మాట్లాడుతూ మా కళాశాల నుండి పట్టాలు పొందిన విద్యార్థినిలు ఏ రంగంలో ఉన్నా కళాశాలకు, తల్లిదండ్రులకు, సమాజానికి గర్వ కారణంగా ఉండాలని కోరారు.

Female students should be at the forefront in all fields.

ఈ కార్యక్రమంలో ఎస్టెట్ మేనేజర్ నాగేశ్వర్ రావు, వైస్ ప్రిన్సిపాల్ జి.సాయారెడ్డి, వివిధ శాఖల అధిపతులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Female students should be at the forefront in all fields.