పోటీతత్వం పెంపొందించేందుకు విద్యార్థినికి జెండా ఆవిష్కరణ అవకాశం
ఇందల్వాయి, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు గ్రామంలోని ప్రధాన జాతీయ జెండాను ఆవిష్కరించే అవకాశం కల్పిస్తున్నట్లు తీర్మాన్‌పల్లి గ్రామ సర్పంచ్ చింతల కిషన్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ధర్పల్లి ప్రభాకర్ తెలిపారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, పోటీతత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఇందులో భాగంగా 2025 - 26 విద్యా సంవత్సరంలో తీర్మాన్‌పల్లి ప్రభుత్వ...