మహిళా సిబ్బంది ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహిళా పోలీస్ సిబ్బంది తమపై తాము ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. మహిళా పోలీసు సిబ్బందికి నూతన మెలకువలతో కూడిన శిక్షణ వినూత్న కార్యక్రమాన్నిసోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు,  భవిష్యత్తులో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళా సిబ్బంది  తీసుకోవలసిన జాగ్రత్తల...