Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 July 2025, 4:24 pm Posted by : ramakrishna

మహిళా సిబ్బంది ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహిళా పోలీస్ సిబ్బంది తమపై తాము ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. మహిళా పోలీసు సిబ్బందికి నూతన మెలకువలతో కూడిన శిక్షణ వినూత్న కార్యక్రమాన్నిసోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు,  భవిష్యత్తులో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళా సిబ్బంది  తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నేర్చుకోవడానికి వినూత్న కార్యక్రమాన్నినిర్వహించినట్లు తెలిపారు.  ప్రతి మహిళా సిబ్బంది తప్పకుండా డ్రైవింగ్, స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని రకాల మెలకువలను నేర్చుకొని తర్ఫీదు పొందే విధంగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు  పేర్కొన్నారు. ఈ శిక్షణను ప్రతి మహిళా సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ వారం రోజులపాటు ఉంటుందని కొత్త రకాల పద్ధతులను తెలుసుకోవాలని సూచించారు. ఈ శిక్షణను ప్రభుత్వ స్కూళ్లలో పి.ఈ.టిలు, పీడీ లుగా ఉన్న రెజ్లింగ్, జూడో లలో జాతీయ పతకాలు తీసుకున్న టీచర్ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (ఏ ఆర్ రామ చంద్రరావు,  నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సతీష్ , శేఖర్ బాబు, ప్రభుత్వ స్కూళ్లకు చెందిన సంతోషి రుద్రూర్ హై స్కూల్, అనిత గుండారం జెడ్పిహెచ్ఎస్ స్కూల్, రజని దేగం జడ్పిహెచ్ఎస్ స్కూల్ తదితరులు పాల్గొన్నారు.

Female staff should develop self-confidence184