. . . లంచం ఇవ్వకపోవడంతో అమాయకుడిని అరెస్టు చేసి జైలుకు పంపిన వైనం
. . . కండిషన్ బెయిల్ పై వచ్చిన లంచం డిమాండ్ తో ఎసిబికి పట్టిచ్చిన బాధితుడు
హైదరాబాద్, బతుకమ్మ :
రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా సికింద్రాబాద్ బొయిన్ పల్లి మహిళ ఎస్ఐ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. స్టేషన్ రైటర్ తో కలిసి లంచం డిమాండ్ చేయడంతో ఇరువురిని బాధితుడు అవినీతి నిరోధక శాఖకు పట్టించాడు… వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రేమ వివాహం చేసుకుని, తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని సహాయం కోసం సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి పోలీసులను అభిషేక్ అనే యువకుడు ఆశ్రయించాడు. తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలని పోలీస్ స్టేషన్‌కు రావాలని పిలిచి డబ్బులు అడిగిన మహిళా ఎస్ఐ నందిత..డబ్బులు ఇచ్చేందుకు అభిషేక్ నిరాకరించడంతో, తండ్రిని కొట్టాడని అభిషేక్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించింది. జైలు నుండి బెయిల్ మీద విడుదలయ్యాక ప్రతీ సోమవారం సంతకం చేసేందుకు స్టేషన్‌కు వస్తున్న అభిషేక్‌ను రైటర్ విజయ్ రూ.10 వేలు, ఎస్ఐ నందిత రూ.30 వేలు డిమాండ్ చేసింది. ఇష్టపూర్వకంగా ప్రేమించి పేండ్లి చేసుకుంటే, మేజర్లైనప్పటికి పోలిస్ అధికారులు అనవసరంగా కేసు పెట్టి జైలుకు పంపించడమే కాకుండా, మళ్లి లంచం డిమాండ్ చేయడంతో విసిగిపోయి అభిషేక్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎసిబి అధికారుల సూచనతో బుధవారం బోయిన్ పల్లి పోలిస్ స్టేషన్ లో పోలిస్ అధికారులకు అభిషేక్ లంచం ఇచ్చేందుకు వచ్చాడు. స్టేషన్ ఆవరణలోని తన స్కూటీ తాళం ఇచ్చి డిక్కీలో డబ్బులు పెట్టమని ఎస్ఐ నందిత బాధితుడికి చెప్పింది. బాధితుడు స్కూటీలో డబ్బులు పెట్టగానే, ఎస్ఐ నందితను, రైటర్ విజయ్‌ను అవినీతి నిరోధక శాఖా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఎసిబి కోర్టులో ఎసిబి అధికారులు హజరు పరిచారు.