ఎక్సైజ్ సీఐ వేధింపులకు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కొత్తగూడెం, బతుకమ్మ : ఎక్సైజ్ సీఐ వేధింపులకు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కొత్తగూడెంలో తీవ్ర కలకలం రేపింది. సీఐ నిరంతర వేధింపులకు గురిచేయడంతో ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సదరు మహిళా కానిస్టేబుల్ సీఐ ప్రవర్తనను తట్టుకోలేకపోయి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు సమయానికి గమనించి ఆమెను సమీప ఆస్పత్రికి తరలించడంతో ప్రాణపాయం తప్పింది. ఈ సంఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు ఎక్సైజ్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా ఇతర మహిళా, పురుష కానిస్టేబుళ్లు,...