ఫీజు రీయింబర్స్ మెంట్ లను తక్షణమే విడుదల చేయాలి
. . . బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన "ఫీజు బకాయి - బీజేపీ లడాయి" కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో తిరుమల మెడికల్ కాలేజీలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...