ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి

పి.డి.ఎస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ :  రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పి.డి.ఎస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ డిమాండ్ చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలో పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం గన్ పూర్ గ్రామపంచాయతీ నుండి రైల్వే స్టేషన్ వరకు విద్యార్థుల ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. ఈ  సందర్భంగా  ఆయన  మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్...