నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగ రెండు విద్యా సంవత్సరాలకు విద్యార్థిని విద్యార్థులకు పోస్ట్ మాట్రిక్ స్కాలర్షిప్ మంజూరు కాలేదని, గతంలో స్వీకరించిన మైనార్టీ కార్పొరేషన్ లోన్లు అప్లికేషన్లకు సంబంధించి లోన్లు వెంటనే మంజూరు చేయాలని బి ఆర్ ఎస్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కార్యకర్తలు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండి అక్బర్ నవాజుద్దీన్, ఎండి అప్సర్, ఏ స్వామి, ఎస్.కె రజాక్, సురేందర్,అశోక్ తదితర టిఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.