ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి
నిజామాబాద్, బతుకమ్మ : పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని డీఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం డీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా రాథోడ్ జీవన్ నాయక్, జిల్లా కన్వీనర్ సాయి కృష్ణ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ. 9వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థినులు తదితరులు...