ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు అంజలి అధ్యక్షతన ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని మంగళవారం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు....