- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు అంజలి అధ్యక్షతన ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని మంగళవారం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ, ఎఐపీఎస్ యు, పీడీఎస్ యు, పీడీఎస్ యు విద్యార్థి సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రతి సంవత్సరం 20% నుంచి 30% వరకు ఫీజులు పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుట జలగల్లాక పీడిస్తున్నారని అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లోనే బుక్స్, స్కూల్ డ్రెస్సు, పేరు తోటి అనేక డబ్బులు దండుకుంటూ విద్యాశాఖ అధికారులు కనీసం చర్యలు తీసుకోకుండా ఉండటం అనేది సిగ్గుచేటని ఆయన అన్నారు. దాంతోపాటు జీవో నెంబర్ 42, 91 ప్రకారం ఫీజులు పెంచాలంటే జిల్లా కలెక్టర్ ,జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకొని కమిటీ ద్వారా నిర్ణయించి ఫీజులు పెంచాలి కానీ ఎప్పుడు కూడా కమిటీ ద్వారా ఫీజులు నిర్ణయించి పెంచినట్టు ఎప్పుడు దాఖలు లేవన్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుచేసి ఫీజులు దోపిడీని అరికట్టాలని దాంతోపాటు ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో జీవో నెంబర్ ఒకటి ప్రకారం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఫీజులు పెంచడం చట్టాన్ని అమలు చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్, ఎస్ఎఫ్ఐ నిజాంబాద్ జిల్లా కార్యదర్శి విగ్నేష్, పిడిఎస్యు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రాజేశ్వర్, పిడిఎస్యు నిజాంబాద్ జిల్లా కార్యదర్శి గణేష్, ఏఐఎస్ఎఫ్ నిజాంబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, నాయకులు టోకు సంతోష్, రమేష్, మోతి దినేష్, చరణ్, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.