Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 June 2025, 9:54 pm Posted by : ramakrishna

జర్నలిస్ట్ పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి

  • టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో డిఈవో కి వినతి

 

నిజామాబాద్, బతుకమ్మ : జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలలో 50% ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టి డబ్ల్యూజెఎఫ్) ప్రతినిధులు కోరారు.  బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఇఓ అశోక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడబ్లుజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భాస్కర్, రామచందర్ మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా విలేకరులు పనిచేస్తుంటారని.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరింపజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. అలాంటి జర్నలిస్టులు చాలీచాలని వేతనాలతో తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారని తెలిపారు. కావున ప్రైవేట్ విద్యా సంస్థలలో, కార్పోరేట్ స్కూళ్ళలో చదువుకునే జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50% రాయితీ కల్పించాలని కోరారు. అయితే గతంలో విద్యాశాఖ నుంచి ఫీజు రాయితీ కల్పించాలని ఉత్తర్వులు వెలువడ్డపటికి కొన్ని ప్రైవేటు స్కూలు రాయితీ కల్పించలేదని డీఈవో దృష్టికి తీసుకొచ్చారు. డీఈవో స్పందిస్తూ ఫీజు రాయితీ కల్పిస్తామని తెలిపారు. రాయితీ ఇవ్వని విద్యాసంస్థల పై తమ దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా ప్రతినిధులు పరమేశ్వర్, మధు, కృష్ణ పాల్గొన్నారు.

Fee concessions should be provided to the children of journalists.