Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 8:16 pm Posted by : ramakrishna

వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలి

 

. . . ప్రైవేట్ డిగ్రీ & పిజి కళాశాలల మేనేజ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు బి.సూర్యనారాయణ రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

గత నాలుగైదు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ల బకాయిల వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు, అధ్యాపకులు, ముఖ్యంగా కళాశాల యాజమాన్యాలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారని అందువల్ల వారం రోజులలో పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించాలని ప్రైవేట్ కళాశాల మేనేజ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లు డిమాండ్ చేసారు. శుక్రవారం కామారెడ్డి లో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల రాష్ట్ర ఎక్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. టీయుపిసీఎంఏ అధ్యక్షులు డా. ఎం. జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్, సభ్యులు, వివిధ యూనివర్సిటీ సంబంధించినటువంటి అధ్యక్ష, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరై ఫీజు బకాయిల గురించి చర్చించారు. నాన్ ప్రొఫెషనల్ (జూనియర్, డిగ్రీ & పిజి) కాలేజీల బకాయిలు సుమారు 1500 కోట్ల వరకు మాత్రమే ఉన్నాయని, తక్షణమే 1000 కోట్లు పేద, గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థుల దృష్ట్యా బకాయిలను వెంటనే విడుదల చేసి కళాశాలలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్జిక్యూటివ్ సభ్యులు హరిస్మరణ్ రెడ్డి, గురువేందర్ రెడ్డి, నిషిత రాజు, మారయ్య గౌడ్, సూర్య ప్రకాష్, సంజీవ్, గిరి తదితరులు పాల్గొన్నారు.

 

Fee arrears should be released within a week.