. . . గంజాయి కి అలవాటు పడడంతోనే ఈ ఘటన
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని నల్లవెల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.కన్న కొడుకు గంజాయికి అలవాటు పడి మత్తుకు బానిసై నిత్యం డబ్బులు ఇవ్వాలని వేధిస్తూ ఉండడంతో బుధవారం రాత్రి తన కన్న కొడుకు కొత్తొల్ల భాను ప్రకాష్ ను తండ్రి కిషన్ గొడ్డలితో నరికి చంపాడు. బుధవారం రాత్రి కూడా డబ్బులు ఇవ్వాలని వేధించడంతోనే ఈ సంఘటన జరిగినట్లు బాధితులు తెలిపినట్లు సమాచారం. అనంతరం స్థానిక ఇందల్వాయి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది