Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 June 2025, 11:22 am Posted by : ramakrishna

భార్యపై కోపంతో  కొడుకును చంపిన తండ్రి

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారంలో ఘటన

కామారెడ్డి, బతుకమ్మ:  భార్యపై కోపంతో అణ్యం పుణ్యమెరగని  కొడుకును ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేసి తండ్రి హత్య చేశాడు. ఈఅమానవీయ ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన నర్వ అనిల్​కు నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన అక్షితతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు శశాంక్​, ఏడు నెలల కూతురు ఉన్నారు. దంపతులు ఇద్దరు తమ పిల్లలతో కలిసి మంగళవారం మెదక్ జిల్లా శాలిపేట గ్రామంలో బోనాల పండుగకు వెళ్లారు. అక్కడ అనిల్​ చెల్లె కూతురిని శశాంక్​ మెట్లపై నుంచి తోసేశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బుధవారం అనిల్​ తన భార్య పిల్లలతో పొల్కంపేటకు వచ్చాడు. ఈవిషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరడంతో అనిల్​ తన భార్యను కొట్టాడు. అనంతరం వైద్యం చేయిస్తానని చెప్పి గురువారం అక్షితను పోచారంలోని తల్లిగారింటికి తీసుకొచ్చాడు. అక్కడ ఆమెకు ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. కాగా.. తన కుమారుడిని తీసుకొని వెళ్లిన అనిల్ గ్రామ శివారులో ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చంపేశాడు. అనంతరం ఇంటికి తీసుకు వెళ్లాడు. కాగా.. బాబు అచేతనంగా పడి ఉండడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అనిల్​ను నిలదీయగా భార్యపై కోపంతో తానే  హత్య చేసినట్లు చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అక్షిత ఫిర్యాదు ఈ మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ నాయక్ తెలిపారు.