పిడుగుపాటుకు తండ్రి మృతి.. కుమారుడికి గాయాలు

నాగావళి నది తీరాన స్నానం చేస్తుండగా .. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా బలగబుచ్చిపేట ఘటన శ్రీకాకుళం, బతుకమ్మ : పిడుగుపాటుకు తండ్రి మృతి చెందగా.. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా బలగబుచ్చిపేటలో చోటు చేసుకుంది. తండ్రి గేదెల రాజారావు, కుమారుడు నాగార్జున ఇద్దరు నాగావళి నది తీరాన స్నానం చేస్తుండగా పిడుగుపడింది. ఈప్రమాదంలో తండ్రి రాజారావు మృతి చెందగా, కుమారుడు నాగార్జున తీవ్రంగా గాయపడ్డాడు.