బాన్సువాడ, బతుకమ్మ :
ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య చేసుకున్నా ఘటన నిజాంసాగర్‌లో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన కృష్ణ(32) తన కుమారుడు రక్షిత్ (9), కుమార్తె అనన్య(5)తో కలిసి గురువారం నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్దకు వచ్చాడు. సాయంత్రం వరకు ప్రాజెక్ట్ వద్ద పిల్లలతో సరదాగా గడిపాడు. అనంతరం ముగ్గురు అక్కడ భోజనాలు సైతం చేశారు. సాయంత్రం పూట ఇద్దరు పిల్లలను నీటిలో తోసేసి తాను కూడా దూకాడు. కుటుంబ కలహాల కారణంగా ఆయన పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం ఆరేడు శివారులోని 20 గేట్ల వద్ద మృతదేహాలు లభ్యమయ్యాయి. నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ముగ్గురి మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
