బొల్లారం గ్రామంలో తండ్రీ కొడుకులపై పిడుగుపాటు
బతుకమ్మ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని బొల్లారం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షంలో తండ్రి కొడుకుల పై పిడుగు పడి కొడుకు మృతి చెందగా, తండ్రికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన మంద నాగభూషణం, కుమారుడు వెంకటి (26) వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోసి ఉండగా వర్షం కురుస్తుండడంతో చెట్టు కిందికి వెళ్లారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడి పిడుగు పడింది. మంద వెంకటి మృతితో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.