కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా లింగాయపల్లి-కొట్టాలపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. కొట్టాల పల్లి చెరువు వద్ద పూజా కార్యక్రమం అనంతరం దిష్టి సామాగ్రీ నీటిలో పారవేసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి తండ్రి సుంకరి పెద్ధ నర్సింలు (65), కుమార్తె రజిత (30) మృతి చెందారు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. శుక్రవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లింగాయిపల్లికి చెందిన సోమిశేట్టి మల్లేషంకు రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతనికి గురువారం రాత్రి దిష్టి తీసిన అతని భార్య రజిత, తన తండ్రి టేక్రియాల్ కు చెందిన పెద్ద నరసయ్య పూజల అనంతరం చెరువులో దిగి దిష్టి సామాగ్రిని నిమజ్జనం చేస్తుండగా అది లోతు ఉంది తండ్రి , కూతురు నీట మునిగి చనిపోయినట్టు తెలిసింది.ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ తెలిపారు.