Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2025, 11:56 am Posted by : ramakrishna

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

డిచ్ పల్లి లో  బ్రిడ్జి వద్ద కంటైనర్ ఢీ కొట్టిన  మరో కంటైనర్

కంటైనర్ పై నుంచి కిందపడి క్లీనర్ దుర్మరణం

 డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లి వద్ద జాతీయ రహదారి 44 పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి గురుగ్రామ్ వెళ్తున్న కంటైనర్ ను వెనుక నుంచి వచ్చిన మరో కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్లీనర్ కంటైనర్ పైనుంచి కింద పడగా దాని చక్రాల కింద నలిగి అతడు దుర్మరణం చెందాడు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బైకుల లోడ్లతో వెళ్తున్న కంటైనర్ అద్దం పగలడంతో డ్రైవర్ డిచ్ పల్లి బ్రిడ్జి వద్ద  రహదారిపై పక్కన నిలిపి పరిశీలిస్తున్నాడు. ఈక్రమంలో వెనుక నుంచి వచ్చిన మరొక కంటైనర్ దీన్ని ఢీ కొనడంతో ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కానీ కింద పడిన క్లీనర్ పైనుంచి లారీ టైర్లు వెళ్లడంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డిచ్పల్లి పోలీసులు అక్కడ చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాయపడిన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన క్లీనర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Fatal road accident on national highway