Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 July 2025, 5:55 pm Posted by : ramakrishna

లింగంపేట్ కేకేవై రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

  • పలువురికి తీవ్ర గాయాలు

 

లింగంపేట్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ కేకేవై రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లింగంపేట మండలం ఎల్లమ్మ తండా సమీపంలో శనివారం సాయంత్రం యాక్సిడెంట్​ జరిగింది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట నుంచి కామారెడ్డి  వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కామారెడ్డి నుంచి లింగంపేట వైపు వస్తున్న లారీ ఎదురెదురుగా ఎల్లమ్మ తండా వద్ద ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. బస్సులో వందమందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే లారీ డ్రైవర్​ సైతం తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Fatal road accident on Lingampet KKY road