తిరుపతి, బతుకమ్మ : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాకాల మండలం తోటపల్లి వద్ద పూతల పట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై వేగంగా వెళ్తోన్న ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రుల్ని సమీప ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.