Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2025, 2:04 pm Posted by : ramakrishna

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. మృతులను తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు అర్విన్ (6), అత్తసునీత (56) గా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడికి గాయాలయ్యాయి.