Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 July 2025, 10:19 am Posted by : ramakrishna

జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

రాంబన్ జిల్లాలో లోయలో పడిన పర్యాటకుల బస్సు

వెబ్ న్యూస్, బతుకమ్మ : జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాంబన్ జిల్లాలో పర్యాటకుల బస్సు రోడ్డు పక్కన ఉన్న 600 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనలో మృతులకు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలిపారు.