ఘోర ప్రమాదం.. నలుగురి మృతి
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఘటన అనకాపల్లి, బతుకమ్మ : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.