Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 April 2025, 6:23 pm Posted by : ramakrishna

అకాల వర్షంతో అన్నదాతల ఆందోళన

బతుకమ్మ బోధన్: తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో మంగళవారం అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది. పలు గ్రామాల్లో వర్షం అకస్మాత్తుగా కురవడంతో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసి పాడైపోయే పరిస్థితి ఎదురైంది. కోత పూర్తి చేసి, పొలాల్లో లేదా మడుల్లో ఉంచిన ధాన్యం వర్షానికి తడవకుండా కాపాడేందుకు రైతులు పడిన శ్రమ వృథా అయింది. వర్షపు నీటితో ధాన్యం నాణ్యత దెబ్బతిని మార్కెట్‌లో ధరలు పడిపోయే అవకాశం ఉంది. ఈ అకాల వర్షం వల్ల వరి, మక్క, శెనగ వంటి పంటలకు తీవ్ర నష్టం కలిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణ పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టం నేపథ్యంలో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.

Farmers worried over untimely rain