వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న రైతులు

రుద్రూర్, బతుకమ్మ : మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పండుగ బహిరంగ సభ సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, పార్వతీ ప్రవీణ్ స్వామి, అడప సాయిలు, కర్క అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.