Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 November 2024, 2:04 pm Posted by : ramakrishna

 సీఎం చిత్రపటానికి పాలాభిషేకం  చేసిన రైతులు

వరి బోనస్ అమలుపై రైతన్నల  హర్షం

బతుకమ్మ: బిచ్కుంద

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హాస్గుల్ గ్రామానికి చెందిన రైతులు వరి బోనస్ పై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ గోసం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ, చేసిందని అలాగే రైతు భరోసా పథకం అమలుపై పూర్తిస్థాయి కసరత్తు కూడా చేస్తుందని ఆయన అన్నారు. మరి ధాన్యానికి బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ గోరీ, మునీర్, నాగనాథ్ అప్ప, నయన్ పటేల్, పెద్ద గంగారం, రాములు డాక్టర్, పంచాయతీ కారోబార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు