బోధన్ , బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా సాలూర మండలం ఫతేపూర్ సాలూర క్యాంప్ గ్రామపంచాయతీ భవనంలో నీటిపారుదల శాఖ అధికారులను రైతులు బంధించారు. తమ పంటలకు నిజాంసాగర్ కాలువ నీటిని అధికారులు అందించలేకపోతున్నారని, దీంతో పంటలు ఎండుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను కార్యాలయంలో ఉండగానే బయట నుంచి తాళం వేసి ఆరుబయట బైటాయించారు.

బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడి రైతులను సముదాయించారు. నీటిపారుదల శాఖాధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
