. .. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
జుక్కల్, బతుకమ్మ :
రైతుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇది ప్రజా ప్రభుత్వం అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో మంగళవారం ఆయిల్ ఫామ్ తోటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పంటను పరిశీలించారు. ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటలపై రైతులతో ముఖాముఖి మాట్లాడి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంటలు నాటిన తరువాత సుమారు నాలుగు సంవత్సరాల నుంచి దిగుబడి ప్రారంభమై, ఆర్థిక లాభాలు క్రమంగా పెరుగుతాయని వివరించారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తరణతో వచ్చే లాభాలను తెలియజేసి, రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయిల్ ఫామ్ వేసిన రైతులను సన్మానించారు.
