నవీపేట్, బతుకమ్మ :
నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలోని రైతు వేదిక లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 90 రోజుల ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం “రైతు వారోత్సవం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి (ఏఈవో) వసంత్ రైతులకు పలు సలహాలు, సూచనలు చేసారు. రైతులు తమ పొలంలోని మట్టిని నమూనా సేకరణ ప్రక్రియ ఏవిధంగా చేపట్టాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏ విదంగా ఉంటాయి, ఎరువులు ఏ మోతాదులో వాడాలో తెలిపారు.

అలాగే వానకాలం, యాసంగి పంటకి ప్రభుత్వం ప్రతిపాదించిన ఎనిమిది రకాల వరి వంగడాలనే వాడాలని, ప్రతి ఒక్క రైతు సేంద్రియ వ్యవసాయం పైనే దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోసైటి సెక్రటరీ రమేష్, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ ఆర్ముర్ లావణ్య శ్రీనివాస్, మాజి సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు, పంచాయితి సెక్రటరీ అఖిల్, గ్రామ కమిటి సభ్యులు బోజారం, కొండయ్య, రైతులు చిన్నదోడ్డి ప్రవిణ్, పోతన్న, సంపత్, సిఆర్పి లు పౌన, అనిత, రైతులు నవిన్, సతీష్ గణేష్, రాజు, దశకాంత్, నవిన్, రాజేందర్, సాయిలు, పోశేట్టి, సాయినాథ్, సాయిల్ హేల్త్ వాలంటిర్స్ మహేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
