దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోఖో, మానవహారం
మోపాల్, బతుకమ్మ : దొడ్డు రకం ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకోవడం లేదని, ప్రభుత్వం కొనుగోలులొ చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ మోపాల్ మండల కేంద్రంలో శనివారం దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాస్తారోఖో నిర్వహించారు. అనంతరం రోడ్డు మీదనే మానవహారం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, మోపాల్ గ్రామ సర్పంచ్ ధ్యాప రవి, అగ్గు చిన్నయ్యలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల...