Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 7:24 pm Posted by : ramakrishna

వరదకాలువకు నీళ్లు తెచ్చిన ఎమ్మెల్యే కు రైతుల కృతజ్ఞతలు

వేల్పూర్, బతుకమ్మ :

 

కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలువకు నీటిని తెప్పించేందుకు కృషి చేసిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా వరద కాలువ వెంట గ్రామాల రైతులు వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో కలిసి శాలువతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ ఈ రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చిన నీటి వల్ల 2500 ఎకరాల పంటను ఎమ్మెల్యే కాపాడరని వారు కొనియాడారు. ఎమ్మెల్యే ను కల్సిన వారిలో కమ్మర్ పల్లి తిమ్మాపూర్, పాలెం, తొర్తి, మోర్తాడ్ గ్రామాల లబ్ది రైతులు ఉన్నారు.