Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 7:06 pm Posted by : ramakrishna

విద్యుత్ సరఫరా పై రోడెక్కిన అన్నదాతలు

బిచ్కుంద, బతుకమ్మ : 

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. విద్యుత్ సరఫరా లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.బిచ్కుంద మండలం సీతారాంపల్లి, మాన్యపూర్, శాంతాపూర్, రాజాపూర్, జగన్నాథ్‌పల్లి చౌరస్తా గ్రామాలకు చెందిన రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు ఆరోపించారు.విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రైతుల సమస్యలను పట్టించుకోని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయానికి 12 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.విద్యుత్ సరఫరాలో సమయపాలన లేకపోవడంతో వ్యవసాయ బోర్లు తరచూ దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో మరింత తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు.ధర్నా స్థలాన్ని పోలీస్ లు చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా తాగు చర్యలు తీసుకుంటామని బిచ్కుంద ఎస్సై గుండెల రాజు ఆధ్వర్యంలో రైతులను నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.కార్యక్రమం లో మాజి జెడ్పి టి సి సంధి సాయిరాం, సీతారాం పల్లి మాజి సర్పంచ్ ర్యాల గంగారెడ్డి,శాంతపూర్ మాజి ఎం పి టి సి పురుషోత్తం రెడ్డి,పెద్ద కొడప్ గల్ సొసైటీ వైస్ చైర్మన్ సంగారెడ్డి, బిజెపి పార్టీ నాయకుడు జ్ఞనేశ్వర్, లతోపాటు రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు.