ధాన్యం కొనుగోళ్లలో జాప్యం పై రోడ్డెక్కిన రైతన్నలు

  భిక్కనూరు, బతుకమ్మ :   భిక్కనూర్ మండలంలోని కాచాపూర్ గ్రామంలో వారి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని బుధవారం రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద సుమారు 6000 బస్తాల దాన్యాలతో తుకం వేసిన బస్తాలు కళ్ళల్లోనే ఉండిపోయాయని లారీల కొరత కారణంగా రైస్ మిల్లులకు పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తు వేసింది మొదలు పంట చేతికొచ్చే వరకు అడుగు అడుగున కష్టాలు ఎదురవుతున్నాయని రైతులు కన్నీరు పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యంపై...