Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 11:08 am Posted by : ramakrishna

పాత పద్ధతిలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

 

* యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్

 భిక్కనూరు,బతుకమ్మ  : 

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ను రద్దు చేయాలని పాత పద్ధతిలోనే ఇవ్వాలని  డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లాలో రైతులు  రోడ్ ఎక్కారు. బుదవారం భిక్కనూరు మండల కేంద్రంలో చౌరస్తా దగ్గర రైతులతో పాటు బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ యూరియా యాప్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న భిక్కనూరు ఎస్ఐ ఆంజనేయులు రైతులకు బీఆర్ఎస్ నాయకులకు  నచ్చజెప్పి ప్రయత్నం చేసిన రైతులు వినకుండా రోడ్డుపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు, బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

Farmers take to the streets for urea, resorting to old methods