యూరియా యాప్ రద్దు చేయాలని రైతుల ధర్నా

  మోర్తాడ్, బతుకమ్మ :   మోర్తాడ్ మండలంలోని దొంకల్ ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారి–63పై సోమవారం రైతులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. శేట్‌పల్లి సహకార సంఘం పరిధిలోని శేట్‌పల్లి, ధర్మోరా, దొంకల్ గ్రామాలకు చెందిన రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడం, యూరియా పంపిణీలో అమలవుతున్న యాప్ విధానం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యూరియా యాప్‌ను రద్దు చేయాలని, రైతులకు అవసరమైన మేర యూరియాను...