బతుకమ్మ,మోర్తాడ్: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వలన వరి పంటలో బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు, సుడిదోమ వ్యాపిస్తున్నదని వ్యవసాయ అధికారి హరీష్ అన్నారు. శనివారం మోర్తాడ్ గ్రామంలోని వరి పంటలను ఆయన పరిశీలించారు. రైతులు తెగులు మందులు పిచికారి చేసుకోవాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు మనోజ్, రాజేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.