రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలి
. . . ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి, బతుకమ్మ : రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో వరి సాగు చేస్తున్న 12.5 ఎకరాల భూమిలో వరి పంటను నిలిపివేసి ఆయిల్ ఫామ్ సాగును ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రైతులకు కేవలం సూచనలు ఇవ్వడం మాత్రమే...