Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 2:12 pm Posted by : ramakrishna

రైతన్నలు చట్టాలను తెలుసుకోండి

 

. . . చట్టాలు మన చుట్టాలు

. . . భూమి, రికార్డులు, పట్టాలు పక్కగా చూసుకోండి

. . . విత్తనాలు, ఎరువుల నాణ్యతలు పరిశీలించండి

. . . సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు

 నందిపేట్, బతుకమ్మ :

ఆహార ధాన్యాలను పండించి ప్రజలదరికి చేరుస్తున్న అన్నదాతలు చట్టాల గూర్చి తెలుసుకోవాలని నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తెలిపారు. నందిపేట్ మండలం లోని సిద్దాపూర్ గ్రామ పంచాయతీ సమావేశపు హల్ లో నిర్వహించిన రైతు న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.రైతుల సంక్షేమార్థం అనేక చట్టాలు ఉన్నాయని వాటిని తెలుసుకొని వ్యవసాయాభివృద్ధిని వృద్ధి చేసుకోవాలని కోరారు.పంటలను పండించడానికి విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేస్తామని కొనెముందు వాటి నాణ్యతను పరిశీలించుకోవాలని పేర్కొన్నారు.నకిలి విత్తనాలు అమ్మినవారు చట్టరీత్యా నిందితులేనని అన్నారు.కరోనా కష్టకాలంలో ఆహార ధాన్యాల కొరత రానివ్వకుండా దేశ ప్రజల కంచంలో పరమన్నాలు చేర్చిన గొప్పవాళ్ళు రైతులని తెలిపారు. తెలంగాణ నీటిపారుదల చట్టం,తెలంగాణ ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ చట్టం, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ చట్టం లాంటివి అనేకం రైతంగానికి రక్షణ కవచంలా… ఉన్నాయని జడ్జి తెలిపారు. గ్రామ అభివృద్ధి కమిటీల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఆమోదనీయం కావని వివరించారు. రైతుల సంక్షేమార్థం రూపొందించిన చట్టాల పరమార్ధం, రైతుల వద్దకు చేర్చడమే న్యాయసేవ సంస్థ లక్ష్యమని జడ్జి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు.నందిపేట్ మండల. వ్యవసాయ అధికారిణి జ్యోత్స్న భవాని వ్యవసాయ, మార్కెటింగ్ చట్టాలు, న్యాయవాది ఆశ నారాయణ మైనర్ బాలలు బైక్స్ డ్రైవింగ్ చేయడం నేరమనె చట్టాన్ని తెలియజేశారు. నందిపేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ చిరంజీవి నేరాలు పౌరుల ప్రాణాలకు ప్రమాదకరమని తెలిపారు.

Farmers should know the laws.

కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మీ నరయ్య, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో జడ్జి మొక్కను నాటారు.

 

డ్రగ్స్ తో జీవితం అతలాకుతలమ్…

Farmers should know the laws.

నందిపేట్ మండల శివారు గ్రామమైన ఐలపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన డ్రగ్స్ విద్యార్థులపై ప్రభావం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు డ్రగ్స్ అలవాటు చేసుకోరాదని, డ్రగ్స్ మానవ జీవితాలను అతలాకుతలం చేస్తుందని వివరించారు.విద్య భవిష్యత్ జీవనవిధానాన్ని రూపొందించి, బంగారు బాటకు తొవ్వ జూపూతుందని విద్యార్థులకు ఉద్బొదించారు. మత్తు జీవితాన్ని కమ్మేసి చీకట్లో ఉంచితే, చదువు జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన అన్నారు.ఎలాంటి వ్యాసనాలకు బానిసలు కావద్దని లెక్చరర్లు బోదించిన పాఠాలు విని విజ్ఞానాన్ని సమూపార్జించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళశాల ప్రిన్సిపాల్ చిన్నయ్య, న్యాయవాది ఆశ నారాయణ, నందిపేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ చిరంజీవి, లెక్చరర్స్ దేవేందర్, శ్రీనివాస్, సాయిరామ్, సాయి కుమార్, రీనా, శాంతి, ఐ. సి. డి. ఎస్ అధికారులు పాల్గొన్నారు