రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి
వినూత్న పద్ధతిలో పంటలు సాగు చేయాలి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సలహా కమిటీ సభ్యుడు కోటపాటి నరసింహనాయుడు వేల్పూర్, బతుకమ్మ : రైతులు భూసార పరీక్షలు చేయించుకోని, నూతన పద్ధతుల్లో సాగు చేయాలని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సలహా కమిటీ సభ్యుడు కోటపాటి నరసింహనాయుడు పేర్కొన్నారు. మంగళవారం అంక్సాపూర్ గ్రామంలో జరిగిన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆయిల్ ఫామ్ పంట ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందడం, ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు పాటించి, రసాయనిక, పురుగుల మందులను...