Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 2:16 pm Posted by : ramakrishna

షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

 

 . . . కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా 

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

రైతులు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేయడంలో అలసత్వం ప్రదర్శించటం తో పాటు సరిపడా కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించక పోవడంతో రోజుల తరబడి రైతులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వరికుప్పల కాపలా కాస్తున్నారు షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద పార్టీ కార్యకర్తలు రైతులతో కలిసి ధర్నా నిర్వహించి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు.

Farmers should buy the grain they have grown without any conditions

.ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ … రైతులు పండించిన పంటకు తేమ శాతం 17 వరకు ఉండవచ్చు అని ప్రభుత్వం నిబంధనలు ఉన్నప్పటికీ పది నుంచి 15% లోపు మాత్రమే తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రాల్లో చెప్పడం వలన అనేక మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తాలు తేమశాతం పేరుతో క్వింటాలుకు 6 కిలోల తరుగు తీయడం వలన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.  అకాల వర్షాలు కురవడంతో ఎండబెట్టిన ధాన్యం తడిసి ముద్దయి ముక్క వస్తుంది, ఫలితంగా ఇంకా వారాలపాటు రైతులు కల్లాలు దగ్గర ఎదురు చూపులు చూస్తున్నారని ఆయన వాపోయారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ సరిపడా లారీలు, గన్ని సంచులు ,లేకపోవడం సమయానికి హమాలీలు లేరనే పేరుతో రైతు పంటను కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం తీసుకోకపోవడంతో మధ్య దళారులు రైస్ మిల్ వ్యాపారస్తులు తక్కువ ధర చెల్లించి ధాన్యం తరలించకపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా తేమశాతం పేరుతో ఇతర కారణాల పేరుతో రైతాంగాన్ని వరికుప్పల వద్ద పడి కాపులు పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. యాసంగి పంటకు బోనస్ ధర చెల్లించాలని, దొడ్డు వడ్ల ను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తాలూ,తరుగు పేరుతో అదనపు దోపిడీని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేని యెడల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు ,శంకర్ గౌడ్, పల్లపు వెంకటేష్,  జిల్లా కమిటీ సభ్యులు సుజాత, జంగం గంగాధర్, నన్నే సాబ్ , నాయకులు నల్లాల నరసయ్య, అనిత దేవేందర్ సింగ్ ఎల్లప్ప ,రాజేశ్వర్, ఎల్లయ్య, అంజయ్య, తదితరులతో పాటు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Farmers should buy the grain they have grown without any conditions