Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2025, 7:33 pm Posted by : ramakrishna

రైతులకు నాణ్యమైన విత్తనాలు అమ్మాలి

  • విత్తనాలు అమ్మిన రైతులకు రసీదు తప్పనిసరి
  • లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద రైతులు విత్తనలు కొనాలి
  • కామారెడ్డి తనిఖీ బృందం ఏడీఏ అపర్ణ

 

మద్నూర్, బతుకమ్మ : మండలంలోని మేనుర్ గ్రామంలోని కిసాన్ ఫర్టిలైజర్ తో పాటు పలు విత్తన దుకాణాలను కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన  విత్తన తనిఖీ బృందం ఏ డి ఏ. అపర్ణ ఆధ్వర్యంలో, పవన్ కుమార్ ఏ ఓ కామారెడ్డి, నరేంద్ర  ఏ ఓ బీబీపేట్, తనిఖీ చేపడుతూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా  రైతులకు నాణ్యతమైన విత్తనాలు మరియు విత్తన చట్టం పరిధిలో లోబడి అమ్మాలని సూచించారు. అందరూ విత్తన డీలర్లు తెచ్చుకున్న విత్తన స్టాక్స్ ఏప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలి. అలాగేఏ స్టాక్స్, ఏ కంపెనీ స్టాక్  తెచ్చుకున్నారో వాటి  పిసి లు మరియు బిల్స్, ఇన్వైస్ పెట్టుకోవాలి. రైతులకు అమ్మిన విత్తనాలకు రసీదు తప్పకుండా ఇవ్వాలి.  రైతులు ప్యాకింగ్ లేని విత్తనాలు కొనొద్దు అలాగే మధ్య దళారుల దగ్గర కాకుండా  లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరే విత్తనాలు కొనాలనీ తెలిపారు. విత్తన డీలర్లూ ఎవరైనా పత్తి విత్తనాలను ,సోయా విత్తనాలను అధిక ధరలకు అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు , మండల డీలర్లు ఉన్నారు.