రైతులకు విరివిగా సేవలందించాలి
జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో రైతులకు ఉద్యానవన శాఖ ద్వారా విస్తృత స్థాయిలో సేవలు అందించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం సాయంత్రం ఉద్యానవన శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, నిర్దేశిత లక్ష్యాలు, సాధించిన ప్రగతి, రైతులకు అందిస్తున్న తోడ్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలో...