Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 April 2025, 7:48 pm Posted by : ramakrishna

రైతులకు సరైన సౌకర్యాలు కల్పించాలి

  • ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ

 

బతుకమ్మ భిక్కనూరు : వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సరైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్  షబ్బీర్ అలీ ఆదేశించారు. భిక్కనూరు పట్టణంలోని గంజిలో  ప్రభుత్వ సలహాదారుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని విక్రయించిన వారం రోజుల్లో డబ్బులు వారి ఖాతాలో పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, విండో చైర్మన్ గంగల భూమయ్య, ఎమ్మార్వో శివ ప్రసాద్, నాయకులు అధికారులు రైతులు పాల్గొన్నారు.

Farmers should be provided with proper facilities.