తెలంగాణ జలసిరిపై రైతులకు అవగాహన కల్పించాలి

  . . . ఎంపీడీవో అనంతరావు   ఇందల్వాయి, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఇందల్వాయి ఎంపీడీవో అనంతరావు సూచించారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా రైతులను చైతన్యపరచాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని ఆయన తెలిపారు. మంగళవారం ఇందల్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం జల...